మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈవీఎం మేషీన్లు భద్రపరిచిన సెంటర్ల వద్ద పోలీసులు మూడంచెల భారీ భద్రత కల్పించినట్టు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. రేపు (ఆదివారం) ఉదయం అర్జాలభావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో నిర్వహించబోయే ప్రక్రియకు ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 470 మంది పోలీస్ సిబ్బంది, మూడు కేంద్ర కంపెనీ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఈ క్రమంలో కౌంటింగ్ సెంటర్ వద్ద కు వచ్చే అభ్యర్థలు, పోలింగ్ ఏజెంట్లు తమ వాహనాలకు లక్ష్మి గార్డెన్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన బస్ లలో కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్ కి వచ్చే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన ఐడీ కార్డులు తప్పకుండా తీసుకురావాలన్నారు. ఇక.. ఎవరూ కూడా ఎలక్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్స్, లాప్ టాప్, ఎలాక్రానిక్ వాచెస్, వీడియో కెమెరాలు తమ వెంట తీసుకురావొద్దని, స్ట్రిక్ట్‌గా రూల్స్ ఉంటాయని రెమా రాజేశ్వరి తెలిపారు.