Tuesday, November 26, 2024

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌.. 16 గేట్లు ఎత్తివేత‌..

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి ప్రాజెక్టులోకి 2.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2.81 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇప్పుడు 588.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నిల్వసామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 308.1702 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement