ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 1.80లక్షల ఇన్‌ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1.97లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 587 అడుగుల మేర నీరుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 కాగా.. ప్రస్తుతం జలాశయంలో 305 టీఎంసీల మేర నీరున్నది. ప్రస్తుతం పది గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement