Sunday, November 17, 2024

నాగార్జున సాగ‌ర్ కు భారీగా వ‌ర‌ద.. 8 గేట్లు ఎత్తివేత

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌లా మారాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. శ్రీ‌శైలం ప్రాజెక్టు గేట్లు సైతం ఓపెన్ చేసి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. అధికారులు సాగర్ 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,11,536 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 589.10 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 309.3558 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement