నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 80,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి 2,14,231 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,31,231 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉన్నది. జలాశయం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా, ఇప్పుడు 312.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాల్వ నుంచి 7381 క్యూసెక్కులు, ఎడమ కాల్వ నుంచి 8022 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement