పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని తుర్కపల్లి మండలం వెల్లుపల్లి, దత్తాయ పల్లి, వెంకటాపూర్, దెయ్యం బండ, తుర్కపల్లి, మల్కాపూర్, బద్దుతండా, బిల్యా తండా,ముల్కలపల్లి, జేతి రామ్ తండా, సంగ్య తండా, రాంపూర్ పూర్, గ్రామాలలో ఎస్ బి ఎఫ్ నిధుల కింద మంజూరైన అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కమిటీలతో కలసి గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, దత్తాయపల్లి గ్రామానికి స్పెషల్ అధికారిని నియమించి ప్రణాళికతో పాటు గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పరుచుకోవడానికి కలెక్టర్ తో మాట్లాడి అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని 25 లక్షల రూపాయలు నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేశారన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలకు చేయూత నిచ్చే పథకాలను అందజేస్తున్నామని, ఎమ్మెల్యే ఫండ్ ఎవరికీ ఇవ్వకుండా ముఖ్యమంత్రి ముందుచూపుతో ప్రణాళిక ప్రకారం ప్రజలందరికీ చేరవేశారని, ముఖ్యమంత్రి పరిపాలనలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టమన్నారు. అన్ని కులాలకు ప్రభుత్వం చేయూతనిచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, కో ఆప్షన్ షరీఫ్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కర్ణాకర్, బోరెడ్డి వనజ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచులు రామ్మోహన్ శర్మ, కల్లూరి ప్రభాకర్ రెడ్డి, పడాలవనిత శ్రీనివాస్, అమల బాలకృష్ణ, రమేష్, ఇమ్మడి మల్లప్ప, జ్యోతి, లలితశ్రీనివాస్, బబ్బురి రవీందర్ గౌడ్, రాజయ్య, బద్దు నాయక్, పత్తిపాటి మంజుల, తదితరులు, పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement