Sunday, September 15, 2024

NLG: గంజాయిని కూకటివేళ్ళతో పెకిలించాలి.. కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాపిడ్ టెస్టులు నిర్వహించాలి
గంజాయి అమ్మినా, తీసుకున్నా జైలుకు పంపండి
యాంటి సోషల్ ఎలిమెంట్స్ ని సహించేది లేదు
మునుగోడు, సెప్టెంబర్ 4(ప్రభ న్యూస్): మునుగోడు నియోజకవర్గంలో గంజాయిని కూకటివేళ్లతో పెకిలించడానికి పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని, దానికి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. మునుగోడు మండలంలో బెల్ట్ షాపులు, గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అవసరమైతే అరెస్టు చేసి జైలుకు పంపండని కఠినంగా ఆదేశాలు జారీ చేశారు.

మండలంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఎవరు పాల్పడిన సహించేది లేదని, వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మునుగోడు సర్కిల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై 30కేసులు నమోదు చేశామని, 105 మందిని బైండోవర్ చేశామని పోలీసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గానికి గంజాయి ఎక్కడ నుండి వస్తుందో వాటి మూలాలను తెలుసుకొని అరికట్టాలన్నారు. గంజాయికి అలవాటైన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ గంజాయి బారిన పడకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో చండూరు సిఐ వెంకటయ్య, మునుగోడు ఎస్సై చందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement