Wednesday, November 20, 2024

రైతులబలవంతపు భూసేకరణ నిలిపివేయాలి..

చిట్యాల, ప్రభన్యూస్ : రైతులబలవంతపు భూసేకరణ నిలిపి వేయాలనితెలంగాణ జనసమితి రాష్ట్రఅధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటలో రైతులతో ఆయన మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న గిద్ద ముత్తారం, నవాబుపేట, గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులందరు ముక్త కంఠంతో గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేదేలేదని తెలిపారు. కోదండరాం మాట్లాడుతూ రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, ఈ హైవేను మంథని నుండి భూపాలపల్లి ఎన్ హెచ్ 353 సి హైవేకి, లేదంటే ఓడేడు టేకుమట్ల మీదుగా రేగొండ ఎన్ హెచ్ 353 సికి ఓడేడు గిద్దేముత్తారం మీదుగా మోరంచపల్లి మీదుగా ఎన్.హెచ్ 353 సి కలిపేవిధంగా వెంటనే అలైన్ మెంట్ మార్చేవిధంగా చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ రత్నం. కిరణ్, మండల అధ్యక్షులు అంబాల. రమేష్, మాజీ ఎంపీటీసీ మహేందర్,రైతులు బిల్లా బిల్లా సత్యనారాయణ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, సారంగం, దువ్వల రాజయ్య, కొక్కుల. రమేష్, సత్యనారాయణ, మహిళా తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement