Friday, November 22, 2024

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. కాగా, గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దుంకుత్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. కాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,35,786 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 3,29,394 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.90 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 306.0414 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement