Saturday, November 23, 2024

మ‌త్స్య‌కారులు ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు : మంత్రి తలసాని

మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని, చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయ‌ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై కార్యాచరణ రూపొందించిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం అన్నారు. ప్రభుత్వం గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement