Tuesday, November 26, 2024

రైతు సంక్షేమ‌మే ధ్యేయం : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా తెరాస ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రములోని పాత వ్యవసాయ మార్కెట్లో పత్తి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొడుతున్న సీఎం కేసీఆర్‌ దేశానికి వేగుచుక్కగా కనబడుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం రైతుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం వ్య‌వ‌సాయానికి కేటాయించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 20 లక్షల బోర్లతో వ్యవసాయం చేసిన రైతులు నేడు 24 గంటల ఉచిత విద్యుత్‌ తో తమకున్న భూమిని అంతా వ్యవసాయం చేస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా విద్యుత్ రంగంలో తనదైన విధానంతో దేశంలో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అని వెల్లడించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే మార్కెట్లను బీజేపీ ప్రభుత్వం తీసి వేయాలని చూస్తే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో మార్కెట్లను నడుపుతున్నామని వివరించారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement