Friday, November 22, 2024

కేంద్రీయ విద్యాలయాల్లో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య.. వీణ రోటే

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : దేశంలో కేంద్రీయ విద్యాలయాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు నోడల్ ఆఫీసర్ కెవి బొల్లారం ప్రిన్సిపల్ వీణ రోటే అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి పట్టణ కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో జాతీయ విద్యా విధానం 2020 పురస్కరించుకొని నిర్వహించిన మూడో వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని కేంద్రీయ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన మెరుగైన విద్యను అందించడమే కేంద్రీయ విద్యాలయాల లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా 1250 కేంద్రీయ విద్యాలయాలు, ఇతర దేశాల్లో మూడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయన్నారు.

నూతన విద్యా విధానంలో భాగంగా ప్రవేశ వయస్సు పునర్వ్యవస్థీకరణ, నైపుణ్య విద్యా ప్రేరణ, బాల వాటికలో ప్రవేశం విద్యాప్రవేశం జాతీయ పాఠ్యప్రణాళిక, ప్రేమ్ వర్క్ నైపుణ్య విషయం తల్లిదండ్రుల భాగస్వామ్యం బోధన పరమైన మార్పు ఉపాధ్యాయులకు శిక్షణ ఈ-విద్య 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా సమగ్ర చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో విద్యా విధానాలకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ నల్లగొండ ప్రిన్సిపాల్ నాగభూషణం, సెయింట్ ఎలిజబెత్ పాఠశాల ప్రిన్సిపల్ నన్ లాలి, న్యూ డైమెన్షన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్వేత రెడ్డి, పాఠశాల సిబ్బంది అరుణ్ కుమార్, శర్వాణి, ప్రశాంతి, రెహనా, శిరీష, మమత, సఫియా, రమేష్, ఆనంద్, రాజకుమారి, ఫయాజ్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement