Thursday, November 21, 2024

Nlgd | ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల !

ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. యువతకు ఓటు హక్కు కల్పించేందుకు, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండే వారికి వచ్చే ఏడాది (2025) జనవరి వరకు అవకాశం కల్పిస్తోంది.

సుమారు మూడు నెలల పాటు చేపట్టిన ఓటరు జాబితా సవరణ తర్వాత ముసాయిదా జాబితా మేరకు ఉమ్మడి జిల్లాలో (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి)ని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,64,913 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.

సుమారు మూడు నెలల ఓటరు జాబితా సవరణ అనంతరం ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి) పరిధిలో 29,64,913 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు.

కాగా, ముసాయిదా జాబితా ప్రకారం.. నల్గొండ జిల్లాలో 15,02,203 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 10,04,284 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,58,426 మంది మొత్తంగా 29,64,913 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 204 మంది ఉన్నారు. ఇక‌ మూడు జిల్లాల్లో పురుష ఓటర్లు 14,58,709 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,06,000 మంది ఉన్నారు. పురుషుల కన్నా.. మహిళా ఓటర్లు 47,291 మంది ఎక్కువగా ఉన్నారు.

ఈ జాబితాలోని తప్పులను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పెట్టింది. ఈ నెల 24వ తేదీలోపు అభ్యంతరాలను, తప్పులు, పొరపాట్లను సవరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఇక వచ్చే ఏడాది జనవరి దాకా ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొత్తంగా మూడు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement