Friday, November 22, 2024

NLG: బీఆర్ఎస్ తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి..


పెన్ పహాడ్, నవంబర్ 20 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ పార్టీతోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి జరిగిందని జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రియాజ్ ఉద్దీన్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రఫీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముస్లిం మైనారిటీల కోసం ప్రతి సంవత్సరం 2వేల 200 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందని, రాష్ట్రంలో మైనార్టీ గురుకుల స్కూల్స్, ఇంటర్మీడియట్, కళాశాలలు స్థాపించి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం జరిగిందని, సూర్యాపేట నియోజకవర్గంలో 42గ్రామాల్లో కబరస్థాన్లకు ప్రహరీ గోడల కోసం మూడు కోట్ల 50 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేసిందన్నారు.

నియోజకవర్గంలో 7వేల కుటుంబాలకు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ కానుకగా ఈద్ తోపా అందించారన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ మంత్రి జగదీశ్ రెడ్డి గెలుపు కోసం కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ తూముల ఇంద్రసేనారావు, మాజీ సర్పంచ్ ఊరుకొండ రాధాకృష్ణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సుభాన్, గ్రామ శాఖ అధ్యక్షులు ఒగ్గు గోపి, జిల్లా నాయకులు మౌలానా షాహిద్, ముస్లిం నాయకులు షేక్ లతీఫ్ సాబ్, షేక్ రెహిమాన్, సైదులు, నజీర్, లాలు సయ్యద్, బిక్కంసాబ్, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement