Wednesday, November 20, 2024

నాగార్జునసాగర్ జ‌లాశ‌యానికి కొన‌సాగుతున్న వ‌ర‌ద ప్ర‌వాహం

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. గ‌త వారం రోజులుగా వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుండ‌డంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.51 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇప్పుడు 588 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చు. ప్రస్తుతం 307 టీఎంసీల నీరు ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement