సంస్థాన్ నారాయణపురం, జులై 18 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితుల నుండి ఒక పోలీస్ కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్తే కడపగండి.. తండాకి చెందిన అన్నదమ్ముల భూ వివాదంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు రాగా వారి నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తులు డబ్బులు ఇస్తూ ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బాధితుడు కానిస్టేబుల్ కు 500 ఇస్తుండగా… సరిపోదు రూ.1000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసే వీడియో సీపీ సుధీర్ బాబు దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణ జరిపించి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
- Advertisement -