Saturday, November 23, 2024

40,50 సీట్లలో కాంగ్రెస్ కి అభ్యర్థులు లేరు.. మంత్రి హ‌రీశ్ రావు

నల్గొండ జిల్లా మిర్యాలగూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణలో కాదు, కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందన్నారు. హిమాచల ప్రదేశ్ సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు..వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంద‌న్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు.. నువ్వు మాకు నీతులు చెప్పకు, ఇక్కడ నేర్చుకొని వెళ్లు అన్నారు. 40,50 సీట్లలో కాంగ్రెస్ కి అభ్యర్థులు లేరన్నారు మంత్రి హ‌రీశ్ రావు. మూడోసారి వచ్చేది ముమ్మాటికీ బి ఆర్ ఎస్ పార్టీనే అన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కొందరు. అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించాలన్నారు. విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరగకుండానే ఎందుకు అవార్డులు వచ్చాయి.పంచాయతీల్లో 38 శాతం అవార్డులు వచ్చాయి.మిషన్ భగీరథ, అటవీ అభివృద్ధి, విద్యుత్ శాఖ, వైద్య శాఖకు అవార్డులు వచ్చాయి ఉన్న 10 జిల్లాల్లో 9 జిల్లాలు నాడు వెనుకబడ్డ జిల్లాలు అని ప్లానింగ్ కమిషన్ గుర్తించింది.

33 జిల్లాల తెలంగాణ దేశానికి దిక్సూచిగా అయ్యింది.లక్షకు 22 సీట్లతో అత్యధిక ఎంబిబిఎస్ సీట్లతో దేశానికే నెంబర్ 1 గా ఉంది. తెలంగాణలో కాదు, కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ అన్నారు. తెలంగాణ యువత కలలు సాకారం చేసింది బి ఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్పారు. విద్యార్థుల‌ను మ‌భ్య‌పెట్టేందుకు, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం మాత్ర‌మే ఉమ్మడి ఏపీలో ఎపీపీఎస్సీ ద్వారా నోటిఫికేష‌న్లు ఇచ్చే వారు. అయినా అవి కూడా స్వ‌ల్ప‌మే. 2004 నుంచి 2014 వ‌ర‌కు.. అంటే ప‌దేళ్ల కాలంలో ఉమ్మ‌డి ఏపీలో (23 జిల్లాల‌కు) ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవ‌లం 24,086. ఇందులో తెలంగాణ బిడ్డ‌ల‌కు క‌నీసం 6వేల ఉద్యోగాలు కూడా ద‌క్క‌లేదు. కానీ  తెలంగాణ యువ‌త ఉద్యోగ క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు వెంటనే.. టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు.
ఉమ్మ‌డి ఏపీలో అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టి నాన్ లోక‌ల్ విధానాన్ని ర‌ద్దు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కే వంద శాతం ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. పాత జోన‌ల్ వ్య‌వ‌స్థ వ‌ల్ల స్థానికేత‌రుల‌కు జిల్లా స్థాయిలో 20శాతం, జోన‌ల్ స్థాయిలో 30శాతం, రాష్ట్ర స్థాయిలో 40 శాతం కోటా ఉండ‌టంతో తెలంగాణ యువ‌త‌కు అన్యాయం జ‌రిగేలా అవ‌కాశం ఉంద‌ని సీఎం కేసీఆర్ గ్ర‌హించారు. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకు వచ్చేలా చేశారు. నల్గొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా అయ్యిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement