Saturday, November 23, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పోటాపోటీ.. ఎమ్మెల్సీ ఒక్కరికే..

నల్గొండ, (ప్రభన్యూస్‌) : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జిల్లా నుండి ఒక్కరికి వస్తుందా.. ఇద్దరికి ఇస్తారా.. నామినేషన్ల గడువు గంటల వ్యవధిలోనే ముగుస్తుంది.. అయినా ఇంకా ఫైనల్‌ చేయని అధినేత కేసీఆర్‌.. అందరిలో ఒకటే ఉత్కంఠ.. ఎట్టకేలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఉంటే ఆరింటిని ప్రకటించారు. సామాజికవర్గాల సమతుల్యం.. తర్జనభర్జనల మధ్య ఉమ్మడి జిల్లాకు ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు. చివరి వరకు శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సాగర్‌ నియోజకవర్గ నాయకులు ఎం.సీ.కోటిరెడ్డిలు ఉమ్మడి జిల్లా నుండి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ సీనియర్‌ నాయకులు గుత్తా సుఖేందర్‌ రెడ్డినే ఎమ్మెల్సీ వరించింది. నామినేషన్ల చివరిరోజు కావడంతో గుత్తా ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆరు స్థానాలను ఆరు మాత్రమే నామినేషన్‌ లు దాఖలు కావడంతో పరిశీలన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

కానీ సాగర్‌ నియోజకవర్గ నేత ఎం.సీ.కోటిరెడ్డికి నిరాశే ఎదురైంది. సగటు ఉపఎన్నికల్లో సమయంలో కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఖాయమేనని అందరూ భావించారు. అయితే సీఎం కేసీఆర్‌ సామాజికవర్గాలు, సీనియార్టీ, సిన్సియార్టీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పదవులు కట్టబెట్టినట్లు చెపుతున్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి ముఖ్యఅనుచరుడు కోటిరెడ్డి కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. కానీ చివరి నిమిషంలో చేజారిపోయింది. దీంతో కోటిరెడ్డి అనుచరులు కొంత నిరాశలో ఉన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ దక్కని కోటిరెడ్డిని స్థానిక ఎమ్మెల్సీగా బరిలో దించే అవకాశాలు ఉన్నట్లు- తెలుస్తోంది. ఆయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుపొందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని కాదని కోటిరెడ్డి ఇస్తారా అన్న ప్రశ్నలు కూడా లేకపోలేదు. అయితే సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అని అంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లా నుండి ఒక్కరికే దక్కడం.. సీనియర్‌ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement