నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పొయింది.
దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు నిర్వహించారు. దీంతో బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగా ఎన్నికైన చైర్మన్ శ్రీనివాస రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి అభినందించారు.