Thursday, November 21, 2024

అంధకారంలో బోనాల ఉత్సవాలు.. ఏర్పాట్లలో మున్సిపల్ అధికారులు విఫలం

మోత్కూర్, (ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం లో ప్రతి పండుగలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఓ వైపు పాలకులు చెబుతుండగా.. మరో వైపు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల నుండి ప్రభుత్వం పట్ల విమర్శలు తప్పడంలేదు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ప్రతి ఏటా శ్రావణ మాసం లో మఘ కార్తె లోపే ముత్యాలమ్మ కు బోనాలు సమర్పిస్తారు. మోత్కూర్ గ్రామపంచాయతీ గా ఉన్న రోజులలో సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తులు బతుకమ్మ, బోనాల పండుగలకు మహిళలకు చీకట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీధి దీపాలు ,లైట్స్ ఏర్పాటు చేసేవారు.

మోత్కూర్ మున్సిపాలిటీ గా మారినప్పటికి ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకల్లో సాయంత్రం చీకటి కావడంతో గాంధీ నగర్,డా బంగ్లా,కొత్త బస్ స్టాండ్ ఏరియా తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ని ఆయా కాలనీల నుండి పెద్దఎత్తున డప్పు చప్పుళ్ల తో బోనాలతో ప్రదర్శనగా వచ్చిన మహిళలు ముత్యాలమ్మ ఆలయం వద్ద, చెర్వుకట్ట నుండి కొత్త బస్ స్టాండ్ వరకు సెంట్రల్ లైట్స్ (డివైడర్ మధ్య)వెలగకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్న పిల్లలతో వచ్చిన యువతులు,సరిగా కళ్ళు కనిపించని వృద్ధ మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు పలువురు మున్సిపల్ అధికారుల పనితీరు తీరుపట్ల తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement