Tuesday, December 3, 2024

NLG | బయో డీజిల్ దుర్వాసనను అరికట్టాలి : సిపిఐ

సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 3(ఆంధ్రప్రభ): గత సంవత్సర కాలంగా మీ కంపెనీ ద్వారా వస్తున్న దుర్వాసనను తగ్గించాలని కోరుతూ సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో దుర్వాసన తగ్గించి కంపెనీ కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చినా… వాసన తగ్గించకపోగా దుర్వాసన ఎక్కువై వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు తదితర రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పొట్టు, బూడిద, ఇండ్ల మీద పడడంతో బట్టలు ఆరవేసుకుంటే నల్లటి బూడిద ద్వారా బట్టలు పాడవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే దుర్వాసన అరికట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, సూరపల్లి జనార్ధన్, గడ్డం యాదగిరి, సిపిఐ గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement