ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : అధిష్టానం ఆదేశిస్తే తనయుడు అమిత్ ను భువనగిరి పార్లమెంట్ బరిలో నిలుపుతానని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో సుదర్శన నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా మాట్లాడుతూ… స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భువనగిరి ప్రాంతంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, తాను మదర్ డైరీ చైర్మన్ గా, ఎంపీగా పనిచేసిన నాటి నుండి నేటి వరకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే ఇక్కడి నుండి ఎంపీగా నా తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. గుత్తా అమిత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే విషయంలో అదిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, రిటైర్డు వార్డెన్స్ సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.