హైదరాబాద్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రంగా.. అధికార టీఆర్‌ఎస్ ప్రచారం సాగిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిసు ్తన్నాయి. ఈనెల 15 వరకు ప్రచారానికి గడువు ఉండగా, ప్రధానపార్టీలు స్పీడు పెంచాయి. తొలి విడతగా యువ ఎమ్మె ల్యేలను నాగార్జునసాగర్‌కు పంపిన గులాబీదళపతి కేసీఆర్ సాగర్ సమీకరణాలను మార్చేస్తున్నారు. ఉప ఎన్నికల ఇన్‌ఛా ర్జిగా మంత్రి జగదీష్‌రెడ్డిని, సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలివిడతగా ప్రచారానికి మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలను పంపారు. విడతల వారీగా.. ఆ ప్రాంత అవసరాలను బట్టి మంత్రుల ప్రచార కార్యక్రమా లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రచారమంతా.. అధినేత కనుసన్నల్లోనే జరుగుతోంది. ఏప్రిల్ రెండోవారంలో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించే అవకాశముండగా, ఈనెల 10 లేదా 14న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో పాల్గొనే అవకాశముంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార కార్యక్రమాలు ఖరారైనా.. సీఎం సభకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. పార్టీ నేతలు మాత్రం సీఎం సభ పక్కా అంటున్నారు. ఎన్నికలకు ముందే హాలియాలో బహిరంగసభ నిర్వహించి.. వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందునుండే ఈనియోజకవర్గం విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రచారరంగంలోకి దిగారు. తెరాస తరఫున బరిలో నిలిచిన నోముల తనయుడు భగత్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని.. ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తన తండ్రి ఆశయాలు సాధించడం కోసం తనకు అవకాశం ఇవ్వాలని భగత్ ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి త్రిపురారం మండలంలో ప్రచారం సాగించారు. రైతుబంధు పథకంతో అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, రైతుకుటుంబాలన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్ధిని ఆశీర్వదించాలని కోరారు. మంత్రి జగదీష్‌రెడ్డి వలసలపై గురిపెట్టి.. వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. రోడ్‌షోలతో, సమావేశాలతో ప్రజలకు భరోసాగా నిలుస్తున్నారు.
జానా ప్రచారం
కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన సీనియర్ నేత జానారెడ్డి తన హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని జానారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి ఇంకా ముఖ్యనేతలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలోకి దిగలేదు. భాజపా అభ్యర్థి రవి నాయక్ ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. తన స్వగ్రామంలో ఆయన వెక్కివెక్కి ఏడుస్తూ ప్రచారం సాగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెంటిమెంటాస్త్రం దట్టిస్తూ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సాగర్ ఉపఎన్నికకు 17న పోలింగ్ జరగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
నాగార్జున సాగర్ లో ప్రచార హీట్…
Advertisement
తాజా వార్తలు
Advertisement