నల్లగొండ : వదంతులతో ఆగం కావద్దని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల వెల్లడించారు.. సూర్యాపేటలో రూ.17 కోట్లతో 250 పడకలతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా రోగులకు రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు అని సూచించారు. కొవిడ్ రోగుల్లో 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 99.5 శాతం మంది రికవరీ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టెస్టు పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే కొవిడ్ రోగులకు తెలంగాణ మెరుగైన సేవలందిస్తోంది అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement