దేవరకొండ టౌన్, ఆగస్టు 17(ప్రభ న్యూస్) : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.వెంకటయ్య హెచ్చరించారు. ఆయన గురువారం ప్రభ న్యూస్ తో మాట్లాడుతూ… దేవరకొండ పట్టణంలోని 20వార్డుల్లో ఆ ఏరియా కార్మికులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డులోని ఏ వార్డు కౌన్సిలర్ ద్వారా సమాచారం గానీ నేరుగా కమిషనర్ కు కానీ సమాచారమిస్తే కచ్చితంగా
స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు.
పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినా యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్యంపై వార్డులో ఎక్కడ చెత్త కనిపించినా కార్మికులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ముఖ్యంగా షాపుల ముందు చెత్త చెదారం వేయకుండా చెత్తబుట్టలోనే వేసుకోవాలని, మున్సిపాలిటీ వాహనం వచ్చేటప్పుడు వాహనంలోనే వెయ్యాలని కోరారు. పారిశుద్ధ్య నివారణపై నిరంతరం నిఘాబెట్టి పారిశుద్ధంపై నిర్లక్ష్యం లేకుండా సిబ్బందితో పని చేపిస్తున్నామన్నారు.