మోత్కూర్, (ప్రభ న్యూస్) : మోత్కూర్ ఎక్సైజ్ పరిధిలోని 5 మండలాల్లో 15 వైన్స్ లకు గాను సోమవారం 4 వ రోజు నాటికి 43 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ విలేకరులకు తెలిపారు. మోత్కూర్ లో 4 ,అడ్డగూడూరులో 2 వైన్స్ లకు ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు దాఖలు కాలేదు. వలిగొండ మండలంలోని 7 వైన్స్ లకు గాను 30 దరఖాస్తులు వచ్చాయి.
మండలంలో అత్యధికంగా అరూరు వైన్స్ కు 7 దరఖాస్తులు రాగా ,గుండాలలో 2 వైన్స్ లకు గాను 13 దరఖాస్తులు వచ్చాయి. గుండాలలో షాప్ నెంబర్ 81 కి అత్యధికంగా 9 దరఖాస్తులు వచ్చాయి. గుండాల లో రెండు వైన్స్ లు ఎస్సీలకు రిజర్వు కాగా, సర్కిల్ పరిధిలోని మినహా 13 వైన్సులు ఓపెన్ ఫర్ ఆల్ రిజర్వ్ (జనరల్ కోటా) అయ్యాయి.
వలిగొండ మండలంలో 32 గ్రామాలు ఉండగా, మోత్కూర్ మండలంలో 10 గ్రామాలు, మున్సిపల్ కేంద్రం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క దుకాణానికి కూడా దరఖాస్తులు రాలేదు. ఈనెల 15 నుంచి 18 చివరి తేదీ వరకు మోత్కూర్,అడ్డగుడూర్ మండలాల నుండి చివరి దశలో దరఖాస్తులు రానున్నట్లు సమాచారం.