నల్గొండ – నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇక్కడికి చేరుకున్న ఎనిమిది బ్యాలెట్ బాక్స్ లకు సీళ్లు లేకపోవడంతో వివాదం మొదలైంది.. కౌంటింగ్ కేంద్రంలోని ఆరో నెంబర్ రూంలో నాలుగు బాక్సులు సీల్ లేకుండా ఉన్నాయని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ అభ్యర్థి జయసారథి రెడ్డికి చెందిన ఏజంట్లు ఈ విషయంపై ఆందోళనకు దిగారు. అలాగే మరో నాలుగు బ్యాలెట్ బాక్స్ లు కూడా సీళ్లు లేకుండా ఉండటం గమనించారు.. దీంతో బిజెపి ఏజెంట్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడే భైఠాయించారు.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారందర్ని బయటకు పంపివేశారు.. అయినప్పటికీ బిజెపి, సిపిఐ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై బిజెపి నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.. కాగా ఏజెంట్లు చేస్తున్న ఆరోపణలను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు.. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ ల సీళ్లు తెరిచామని, అయినప్పటికీ తమపై ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement