హైదరాబాద్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తొలి రౌండ్ లో 4084 ఓట్ల ఆధీక్యం సాధించిన టిఆర్ ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి రెండో రౌండ్ ముగిసే నాటికి తన అధీక్యాన్ని పెంచుకున్నారు.. రెండో రౌండ్ లో తన ప్రత్యర్ధుల కంటే 3787 ఓట్లు అధికంగా సాధించారు.. దీంతో రెండు రౌండ్లు ముగిసేనాటికి పల్లా మొత్తం 7871 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు..రెండో రౌండ్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్‌కు 12,070 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244, రాణిరుద్రమకు 1,634, చెరుకు సుధాకర్‌కు 1,330, జయసారధికి 1,263 ఓట్లు దక్కాయి. మరో 3,009 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు నల్గొండలో కొనసాగుతున్నది.. కాగా, మొదటి రౌండ్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12046 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 9080 ఓట్లు వచ్చాయి. మూడుస్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్‌రెడ్డికి 6615 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో 2789 ఓట్లు చెల్లకుండా పోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement