హైదరాబాద్, : యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని, తుది మెరుగులు దిద్దే పనులను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుదిరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యా చరణ గురించి సీఎం ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరి సర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సీఎం ఖరారు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్ర#హరీగోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సీఎం గడువు విధించారు. దీప స్తంభాన్ని, ప్ర హరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్‌కు కూడా ఇత్తడితో ఆకృతులు బిగించాలని సూచించారు.
సుదర్శన చక్రం తరహాలో త్రిశూలం
యాదాద్రి ఆలయంలో భాగంగా నిర్మిస్తున్న శివాలయ గురించి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని సూచించా రు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుం డా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుది మెరుగులు దిద్దాలని సీఎం అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని, రథశాలను టెంపుల్ ఎలివేషన్‌తో తీర్చిదిద్దాలన్నారు.
వెలుగుల పుష్కరిణి
విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్ర హరీగోడల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలు అలంకరించాలని సీఎం సమీక్ష సందర్భంగా సూచించారు. 80 ఫీట్ల పొడవు వున్న దీపస్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు. అద్దాల మండపం అత్యంతసుందరంగా నిర్మితమౌతున్నదని కితాబిచ్చారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాల చుట్టూ పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం తిలకించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాద్రిగా యాదాద్రి….
Advertisement
తాజా వార్తలు
Advertisement