నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ హరిచందన దాసరి నియమితులయ్యారు. తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం జీ హెచ్ ఎం సి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా , కార్పొరేట్ సామాజిక బాధ్యత)అడిషనల్ కమీషనర్ గా పనిచేయుచున్నారు..
ఆమె బాల్యం అంతా హైదరాబాద్ లోనే జరిగింది, పి జి పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో చేసారు. తరువాత ఆమె ఎం ఏ ఎకనామిక్స్ , లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో పూర్తి చేసారు.
ఆమె క్లైమేట్ చేంజ్ క్రూసేడర్ , రీసైక్లింగ్ న్యాయవాది అని పిలుస్తారు, ఆమెకు అనేక ప్రశంసలను అందజేసింది. గ్రీన్ గవర్నెన్స్ లో ఆమె చేసిన కృషికి గాను బెటర్ ఇండియా ఎన్నుకొన్న 10 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లోను ఆమెకు స్తానం దక్కింది.
వ్యర్థ పదార్థాల నిర్వహణ పట్ల ఆమె చేసిన కృషి కూడా ప్రశంసనీయం. భారతదేశపు మొట్టమొదటి వెదురు సమావేశ మందిరాన్ని హైదరాబాద్ లో నిర్మించారు. హైదరాబాద్ ఇండియాలోని గచ్చి బౌలి లో భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేకమైన డాగ్ పార్కును నిర్మించారు. ఆమె తన కార్యాలయాన్ని సెరిలింగంపల్లి లో మొట్టమొదటి జీరో వేస్ట్ ఆఫీసుగా మార్చి ISO 14001 ధృవీకరణ పత్రాన్ని పొందారు.