Friday, November 22, 2024

NLG: బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ – కాంగ్రెస్ కు చిక్కిన‌ న‌ల్గొండ మునిసిపాలిటీ….

నల్లగొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డికి వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41, బీఆర్ఎస్ కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా మరోకరు ఓటు వేయలేదు. 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం పార్టీకి వెళ్లి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

కాగా, అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలని.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై అవిశ్వాసం పెట్టారంటూ మాజీ మునిసిప‌ల్ ఛైర్మ‌న్ సైది రెడ్డి ఆరోపించారు. గత నాలుగేళ్లుగా అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ ని వందల కోట్లతో అభివృధ్ది చేశామని తెలిపారు. కుట్రలు కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వెయిట్ వేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement