Saturday, September 14, 2024

Nalgonda – వైద్య సిబ్బంది నిర్లక్ష్యం – కుర్చీలోనే డెలివ‌రీ…..

న‌ల్గొండ జిల్లాలో వైద్యుల నిర్ల‌క్ష్యం
పురిటి నొప్పులు ప‌డుతున్న డాక్ట‌ర్ల చోద్యం
వెంట‌నే స్పందించిన అద‌న‌పు క‌లెక్ట‌ర్
వైద్య సిబ్బందిపై చ‌ర్య‌ల‌కు ఆదేశం..

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పినా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ఒప్పుకోకపోవడంతో గర్భిణీ అశ్వనీ కుర్చీలో కూర్చుండగానే తీవ్ర రక్తస్రావం అయింది. అందులోనే ఆమె మ‌గ‌బిడ్డ‌ను ప్ర‌స‌వించింది. కాగా, దీనిని చూసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టి నానా హాంగామా చేశారు. విష‌యం తెలుసుకున్న అద‌న‌పు క‌లెక్ట‌ర్ పూర్ణ చంద‌ర్ హాస్ప‌ట‌ల్ వ‌చ్చారు.. వెంట‌నే ఘ‌ట‌నకు బాధ్యులైన వారిపై చ‌ర్య‌ల‌కు ఆయ‌న సిఫార్స్ చేశారు.

- Advertisement -

వివ‌రాల‌లోకి వెళితే నేరేడుగోమ్మకు చెందిన అశ్వినీకి పురిటి నొప్పులు రావడంతో దేవరకొండలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. మూడవ కాన్పుకు పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల నిర్లక్ష్యంతో కుర్చిలోనే ప్ర‌స‌వం జ‌రగ‌డంతో వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తక్షణమే వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement