నల్గొండ – గతకాలంగా రైతుల పక్షాన నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. ఇవాళ భారీ మహా ధర్నాకి సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ నేరవేర్చలేదంటూ..ముఖ్యంగా రైతులకు అన్యాయం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ నేతలు ఇవాళ నల్గొండలో రైతు మహాధర్నా చేపడుతోంది. నల్గొండలోని క్లాక్‌టవర్ దగ్గర్ ఈ ధర్నా ఉంటుంది. ఇందులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలూ పాల్గొనబోతున్నారు.
కాగా, హైకోర్టు షరతులతో:ఈ మహా ధర్నాకు హైకోర్టు ప్రత్యేక షరతులు పెట్టింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకే జరపాలని చెప్పింది. నిజానికి ఈ ధర్నాను 21న చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది. అప్పుడు.. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి సిటీలకు వచ్చే సమయం కావడంతో.. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అభ్యంతరం చెప్పారు. దాంతో.. హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు.. 28న జరుపుకునేందుకు ఒప్పుకుంది. అందువల్ల ఇవాళ ఈ ధర్నా జరగబోతోంది.