నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకార్యాలయాన్ని నేడు కెసిఆర్ ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ మహారాష్ట్ర ప్రజల కు భరోసా ఇచ్చేందుకు వచ్చిందని, ఏదో ఆషామాషీగా ఆయారాం గయారాం పార్టీ కాదు అన్న భరోసా కల్పించేందుకే సొంత భవనాలను కొని వాటిలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీకి పెట్టని కోట, ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లోనే తొలి కార్యాలయాన్ని కేసీఆర్ నేడు ప్రారంభించబోతున్నారు.
ఇక్కడినుంచే మహారాష్ట్రలో తదుపరి కార్యాచరణకు పార్టీ సిద్ధమవుతున్నది. అంతేకాదు.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మహారాష్ట్రలో అతిపెద్ద శక్తిగా అవతరించబోతున్నది. తెలుగు నేలపై ఉద్భవించిన మరే రాజకీయ పార్టీకి ఇతర రాష్ర్టాల్లో సొంత పార్టీ కార్యాలయాలు లేవు. ఇతర రాష్ర్టాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. నాగ్‌పూర్‌లోనే కాదు ముంబై, పుణె, ఔరంగాబాద్‌ల్లో కూడా బీఆర్‌ఎస్ పార్టీ సొంత కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాన్వేషణ మొదలుపెట్టింది. సొంత భవనం ఎందుకు కడుతున్నారు అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. కిరాయి ఇండ్లలో పార్టీలు పెడితే ఎప్పుడు బిచాణా ఎత్తేస్తారో తెలియదని అక్కడి స్థానికులు అనుకునే అవకాశం ఉన్నది.