Friday, November 22, 2024

నాగోల్ ప్లై ఓవర్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్

దేశంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరమని ..ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్..కాగా నాగోల్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ.143 కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవున నాగోల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేశామని..దీంతో ఎల్బీ నగర్ – సికింద్రాబాద్‌ రూట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. ఎల్బీనగర్ లో రహదారుల అభివృద్ధికి రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కు అవార్డు రావడం గర్వకారణమని.. మౌళిక వసతుల సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.ఎల్బీనగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని.. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దామని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరం కలిసి పనిచేద్దామని పిలపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement