Sunday, November 3, 2024

సాగర్‌కు వరద ప్రవాహం.. మళ్లీ రెండు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 40,406 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్‌ గేట్లను ఐదడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. అవుట్ ఫ్లో 68,703 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.80 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా…ప్రస్తుతం నీటి నిలువ 311.4474 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement