విద్యుత్ శాఖలో పని చేస్తున్న విద్యుత్ సిబ్బంది విధుల పట్ల శ్రద్ధతో పనిచేయాలని నాగర్ కర్నూల్ విద్యుత్ డిఈ సత్యనారాయణ రాజు అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ లోని విద్యుత్ సరఫరాను.. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా చేసే లాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విధుల పట్ల సిబ్బంది శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించకుండా తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తూ.. అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సిబ్బంది పనితీరు పై ఫిర్యాదులు వస్తే.. వారిపై తగు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. విద్యుత్తు సరఫరా తెలిపే లాక్ బుక్ లో ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో సమాచారం ఉండేవిధంగా ఆపరేటర్ రమేష్ కు డిఈసత్యనారాయణరాజు సూచించారు.