Friday, November 22, 2024

జిల్లాలో గంజాయి వాడకం – అనుమానం వ్యక్తం చేసినమాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి…

నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (మార్చ్ 1) ప్రభ న్యూస్… జిల్లాలో గంజాయి వాడకం జరుగుతుందనే అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ సమీక్ష నిర్వహించి నిఘా పెంచి వాటిని అరికట్టాలని సూచించారు. ఎండాకాలం వ్యవసాయానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ 43 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని 33 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఫోను ప్రస్తుతం 13 టీఎంసీలే వాడుకునే వీలుందని అన్నారు. వైద్య శాఖలో రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది కొరత ఉందని వెల్లడించారు.కనుక డాక్టర్లకు పనిభారం పడుతుందని తద్వారా రోగులకు సకాలంలో వైద్యం అందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, తిమ్మాజిపేట పాండు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement