Sunday, November 24, 2024

వారంతో తర్వాతే రాజ‌కీయ నిర్ణ‌యం – ఎమ్మెల్యే మైనంప‌ల్లి

దూలపల్లి: మెదక్‌ ప్రజలు తనకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఆయన నివాసానికి ఇవాళ పెద్దఎత్తున భారాస కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్‌ను నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిఆర్ఎస్ పెద్ద నేత త‌న‌తోమాట్లాడార‌ని, మీడియాకు ఎక్క‌వ‌ద్ద‌ని సూచించార‌ని వెల్ల‌డించారు.. అలాగే మ‌ల్కాజీగిరిలోవారం రోజుల ప‌ర్య‌టిస్తాన‌ని,అ త‌ర్వాతే త‌న రాజ‌కీయ నిర్ణ‌యాన్నిప్ర‌కటిస్తాన‌ని చెప్పారు.
” జీవితంలో స్థిరపడటం అంటూ ఉండదు. చనిపోయిన తర్వాతే జీవితంలో స్థిరపడినట్లు. టిడిపి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్లు పనిచేశా. ఆ తర్వాత భారాసలో ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా.. వెన్నుపోటు పొడిచే అలవాటు నాకు లేదు. ప్రాణం పోయే వరకు మాటపైనే ఉంటా. మెదక్ ప్రజలు నాకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారు. నేనూ ఎప్పుడూ కాంగ్రెస్‌, భారాస, భాజపాను తిట్టలేదు. అంతా కలిస్తేనే తెలంగాణ సాకారమైంది. భారాసను ఏమీ అనలేదు.. పార్టీ కూడా నన్ను ఏమీ అనలేదు. మల్కాజిగిరిలో వారం రోజులపాటు అనుచరులందరినీ కలుస్తాను. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. వారం తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా. అయితే నా కొడుకుకు 25 ఏళ్లు.. ఇంకా భవిష్యత్‌ ఉంది. భారత్‌లో పోటీతత్వం ఉంది.. నా కొడుకు నా కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్‌లో నా కుమారుడు తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడు” అని మైనంపల్లి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement