హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా టీకా వేసుకుంటేనే చిన్నారులను పాఠశాలల్లోకి అనుమతించనున్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు కరోనా టీకాను తప్పనిసరి చేస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. త్వరలో చిన్నారులకూ కరోనా టీకా అందుబాటులోకి రానుండడంతో రాష్ట్రంలోని పిల్లలందరికీ 100శాతం టీకా వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. చిన్నారులకు కరోనా టీకాను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నవంబరు మొదటి వారంలో చిన్నారులకు కరోనా టీకా కార్యక్రమం ప్రారంభంకానుందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ముందుగా జిల్లాల వారీగా చిన్నారుల వివరాలను సేకరించాలని, ఆత ర్వాత వ్యాక్సినేషన్ వ్యూహాన్ని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చిన్నారులకు కరోనా టీకా అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాల్లోని పాఠశాలలు, ఇంటర్ కళాశాలల వారీగా విద్యార్థుల వివరా లను సమర్పించాలని విద్యాశాఖకు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. జీ. శ్రీనివాసరావు లేఖ రాసినట్లు తెలిసింది. జిల్లాల వారీగా 2-18 ఏళ్లలోపు పిల్లల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2-18 ఏళ్లలోపు వారు 80 లక్షల నుంచి 95లక్షల మధ్యన ఉంటారని ఉన్న తాధికారులు భావిస్తున్నారు. చిన్నారులకు కరోనా టీకాను పల్స్ పోలియో తరహాలో విస్తృత ప్రాతిపదికన నిర్వహించాలని తెలంగాణ ప్ర భుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సచివాలయ ఉన్నతాధికారవర్గాలు చెబుతున్నాయి. చిన్నారులకు టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించేలోపల… అర్హులైన 18ఏళ్ల వారందరికీ రెండు డోస్‌ల టీకాను పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గ్రామాలు, పట్టణాల వారీగా 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పలు సందర్బాల్లో తప్పనిసరి చేశారు. కోవాగ్జిన్‌తోపాటు జైడుస్ కంపెనీ కరోనా టీకాను చిన్నారులకు వేసేందుకు త్వరలో అన్ని అనుమతులు రాను న్నాయి. జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే కంగా తెప్పిం చుకుంది. వ్యాక్సినేషన్లో వెనుకబడిన జిల్లాల అధికా రులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవం తం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement