Saturday, November 23, 2024

మూసీ గేట్లు ఎత్తివేత‌.. నది పరివాహక గ్రామాలకు హెచ్చరిక

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప్రాజెక్టులు జళ సంతరించుకుంటున్నాయి. అన్ని ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండ‌లా తొణికిస‌లాడుతోంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మూసీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి చేరింది. దీంతో మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 642.5 ఫీట్లు కాగా, ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 645 ఫీట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5,500 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,400 క్యూసెక్కులుగా ఉంది. 

మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేయడంతో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు. గేట్లు ఎత్తడంతో ఉధృతంగా ప్రవహించే నీటితో ప్రమాదం ఉన్నందున ఎవరూ చేపల వేటకు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement