Wednesday, December 18, 2024

Musi – ప్రపంచ బ్యాంక్ కే రేవంత్ సర్కార్ టోకరా – ఆధారాల బయట పెట్టిన కవిత

హైదరాబాద్ – మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ హయాంలో రుణం కోసం ఏనాడూ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత కీలక విషయాలను బయటపెట్టారు.

మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్‌ 19వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని అన్నారు. ఆ ప్రతిపాదనల్లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు., హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15 వేల ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement