Friday, November 22, 2024

Musi – క‌ల‌సికట్టుగా ఉంటే మీ ఇళ్లు సేఫ్ – మీకు అండ‌గా మేముంటాం : కెటిఆర్

కూల్చివేయ‌కుండా అడ్డుప‌డ‌తాం
ఐక్య‌తే ప్ర‌ధాన బ‌లం..
మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాంటో అనేది రేవంత్ నినాదం
మూసి పేరుతో వేల కోట్ల దోపిడీకి ప్లాన్
హైకోర్టు మొట్టికాయాలు వేసినా కూల్చివేత‌లు కొన‌సాగుతున్నాయి
ద‌మ్ముంటే ఇచ్చిన వాగ్ధానాలు రేవంత్ నెర‌వేర్చాలి
అంబ‌ర్ పేట మూసీ ప్రాంత నివాసితుల‌తో కెటిఆర్
కెసిఆర్ అన్ని విధాల అండగా ఉంటార‌ని హామీ.

హైదరాబాద్ లో లక్షలాది మందికి ప్రభుత్వం నిద్ర లేకుండా చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరు ఎప్పుడొచ్చి ఇళ్లను కూల్చుతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ‘మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాంటో’ అన్నట్లుగా కాంగ్రెస్ నినాదం ఉందని ఎద్దేవా చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్‌ నగర్‌లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, సుధీర్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ పరామర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై రేవంత్‌రెడ్డి పగబట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో సర్కార్ మూసీ ప్రక్షాళణ చేపడుతోందని అన్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి ఎవరింటికైనా బుల్డోజర్ వస్తే కంచెలు అడ్డుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను కడతామని చెప్పిన ప్రభుత్వం ఏకంగా ఇళ్లనే కూల్చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.

స్వంత నియోజ‌క‌వ‌ర్గంంలో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ కిష‌న్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడపలుక్కున్నారా? అని అడిగారు. పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడని అన్నారు. రేవంత్‌ రెడ్డి నీవు మొగోడివైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ బ్రోకర్లు విడగెట్టే ప్రయత్నం చేస్తారని, మన హక్కులను లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు. మీకోసం బీఆర్‌ఎస్‌ తరఫున కోర్టులో కొట్లాడుతామని భరోసానిచ్చారు కేటీఆర్‌..

కోర్టు మొట్టికాయాలు వేసినా…

శంకర్‌నగర్‌లో ఇండ్లు కూలగొడుతున్నార‌ని అంటూ రేవంత్‌ రెడ్డికి ఏమన్నా సిగ్గుందా అన్నిప్ర‌శ్నించారు…. నిన్ననే హైకోర్టు కూల్చివేత‌ల‌పై మొట్టికాయాలు వేసినా చ‌లనం లేద‌ని చెప్పారు.. 2400 కిలోమీటర్ల నమామీ గంగ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే.. 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు రేవంత్‌ రెడ్డి రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడ్తడట అంటూ వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇదే ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు అవుతాయని లెక్కగట్టామ‌ని . కానీ ఒకేసారి పది రెట్లు ఎలా పెరిగింది? దీనికి సమాధానం చెప్పేటోడు లేడ‌న్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.4 వేల కోట్లతోని మూసీ శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్రాజెక్టులు ప్రారంభించామ‌ని, అదేవిధంగా మూసీపై 540 కోట్లతో 15 బ్రిడ్జిలు మంజూరు చేసినం అన్నారు.

ఇల్లు కూల్చ‌కుండా అడ్డుగా ఉంటాం ..
పేద‌ల ఇండ్లు కూలగొడతామంటే తాము ఊరుకునేది లేద‌న్నారు కెటిఆర్. నువ్వు మొగోనివైతే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయ్ అంటూ రేవంత్ ను డిమాండ్ చేశారు… ఆడపిల్లలకు ఇస్తానన్న నెలకు రూ.2500 ఇవ్వాన‌లి, . ముసలోళ్లకు రూ.4 వేలు . రైతులకు రుణమాఫీ చెయాల‌ని కోరారు. రైతుబందు రూ.15 వేల ఇవ్వాల‌ని కోరారు.. దమ్ముంటే గరీబోళ్లకు 2 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు క‌ట్టాల‌ని అంటూ ఉన్న ఇంట్ల నుంచి తీసుకెళ్లి బయట పడేస్తామంటే ఊరుకునే లేద‌న్నారు.

ఐక్యంగా ఉంటే…

మీ ఇళ్లును కాపాడుకోవాలంటే ఐక్యమత్యంతో ఉండాల‌ని మూసీ ప్రాంత నిర్వాశితుల‌ను కోరారు. మిమ్మల్ని ఎవరు ముడుతడో తామంతా చూస్తామన్నారు. . ఒక్క కాల్‌ కొడితే తామంతా ఒస్తామ‌ని, . మీరు ఎంత గట్టిగ నిలబడితే.. మీ ఇండ్లు అంతే గట్టిగ నిలబడుతాయ‌న్నారు.. కేసీఆర్‌ మీకు అండగా ఉన్నార‌ని అన్నారు. తాము ఇండ్లు పోకుండా చూసుకునే బాధ్యతా మాది అని పేర్కొన్నారు. ఇళ్ల గోడ‌ల‌పై ఆర్‌బీఎక్స్‌ అని ఉంటే దానిని తుడిపేసి కేసీఆర్‌ అని రాయాల‌ని కోరారు..

ఢిల్లీ చ‌క్క‌ర్ల‌తోనే పాల‌న స‌రి..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులను వారి అకౌంట్లలో జమ చేసింది. అయితే 40 శాతం మందికి రుణ మాఫీ కాలేదు. ఇక రబీ సీజన్ వచ్చి పంటకోతలు మొదలైనా పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందకపోడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రైతుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మరో 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడి అల్లాడుతున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా.. దసరాలా లేదు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

పిలిస్తే వ‌స్తాన‌న్నారుగా… రాహుల్ వచ్చేయండి
తెలంగాణలో ప్రజలు, యువత, చిన్నారులు ఎప్పుడు పిలిచిన వస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సమయంలో మాట్లాడారని. తాను సోనియాగాంధీ సైతం తెలంగాణ ప్రజల వెంట ఉన్నామని అన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. . దీనిపై కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రశ్నించారు.
‘ప్రియమైన రాహుల్ గాంధీ, మీ సీఎం బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గళం మీకు వినిపిస్తుందా? యువత, ప్రజలు, చిన్నారి పిలిచిన వస్తానని మీరు వాగ్దానం చేశారు. కాంగ్రెస్ న్యాయ పత్ర విడుదలలో తుక్కుగూడ నుంచి మీ వీడియో ఉంది. మీ మాట మీద నిలబడండి, వాస్తవాన్ని మీరే చూసుకోండి, మూసీ ప్రాజెక్టు బాధిత ప్రజలను కలవండి’ అని కేటీఆర్ రాహుల్‌గాంధీకి పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement