పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. ధనవంతులను మరింత పెద్దవాళ్లను చేశారు ప్రధాని నరేంద్రమోెడీ అని మండిపడ్డారు. మునుగోడు రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. రంగస్థలంలోని పాటని వాడుకున్నారు మంత్రి కేటీఆర్. మీరు ఏ గట్టున ఉంటారో ఆలోచించుకోవాలని చెప్పారు.మునుగోడు ఉప ఎన్నిక రెండు భావజాలాల మధ్య ఊగిసలాడుతోందని అన్నారు. పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.14 నెలల్లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నారాయణపురం ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. మందు, మటన్ పెట్టగానే గందరగోళం కావొద్దు. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించండి. మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వం. రైతు బంధు కావాలా… రాబందు కావాలా.. ఆలోచించుకోండి.మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని చేయలేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు రూ. 1200లకు పెంచిండు. ఎంత బలుపు. అయినా నాకే ఓటు వేస్తారని, వారికి చైతన్యం లేదనే బలుపుతో వారు ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఉప్పు, పప్పు, చింతపండుతో పాటు అనేక నిత్యావసరల ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర రూ. 70 ఉండే.. ఇప్పుడు రూ. 110. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆర్టీసీ ఛార్జిలు కూడా పెరుగుతాయి. సామాన్యుడి బతుకును మోదీ నాశనం చేశాడు. కార్పొరేట్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటుండు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడ పోరాటం జరుగుతుంది.. రెండు భావజాలాల మధ్యన. రెండు పార్టీల మధ్యన, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి. ఇంటింటికీ తులం బంగారం ఇచ్చిన ఇస్తడు. తులం బంగారం ఇచ్చిన తీసుకోండి.. అవన్నీ దొంగల పైసలు.. గుజరాత్ వాళ్ల పైసలు. గరీబోళ్ల పార్టీ నాయకుడు కేసీఆర్‌కు ఓటేయండి. బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పండి. మునుగోడును సస్యశ్యామలం చేయబోతున్నాం. రాచకొండకు కూడా లిఫ్ట్‌లు పెట్టిస్తాం. ఆలోచన చేయండి.. ఆగం కాకండి.. డబ్బుకో, మందుకో లొంగిపోయి బీజేపీకి ఓటేస్తే.. మన కంట్లో మనమే పొడుచుకున్నట్టే అని తెలిపారు.మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీకందరికీ తెలుసు. ఏ ఎమ్మెల్యేనైనా పైకి పోతే ఉప ఎన్నిక వస్తది. ఇక్కడ్నేమో అమ్ముడుపోతే వచ్చింది. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కు మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. నాలుగేండ్ల నుంచి ఒక్క పని కూడా చేయలేదు. మునుగోడు ప్రజలను తులం బంగారం ఇచ్చి అయినా సరే గెలుస్తాననే ధీమాతో ఈ ఎన్నిక రుద్దిండు. మోదీ అహంకరాం, రాజగోపాల్ రెడ్డి మదంతో వచ్చిన ఎన్నిక ఇది.