మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. అయితే.. ఉదయం 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇందులో టీఆర్ఎస్కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. ఇక, తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెయ్యికిపైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4,904, కాంగ్రెస్‌కు 1,877 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్లో టీఆర్ఎస్కు వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే, చౌటప్పల్ మండలానికి సంబంధించి లెక్కిస్తున్న రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థికి 789 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే, ఓవరాల్‌గా రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 563 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే మూడో రౌండ్లో మరోసారి బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. మూడో రౌండ్ ముగిసే సరికి మొత్తంగా టీఆర్ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. సంస్థాన్ నారాయణపురం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నాలుగవ రౌండ్ లో11వందలకి పైగా ఆధిక్యంలో ఉంది బిజెపి.
Munugodu By-Poll:నాలుగవ రౌండ్ లో 11వందలకి పైగా ఆధిక్యంలో బిజెపి
By Maha Laxmi
- Tags
- Munugodu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement