నిజామాబాద్ – ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేసిన డ్రెస్ కోడ్ చీరలను మాకొద్దు అంటూ మున్సిపల్ కార్మికులు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ నిలదీశారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యా లయంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ మున్సిపల్ కార్మి కులకు బట్టల పంపిణి కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ కార్య క్రమానికి హజరైన మున్పిల్ కార్మికులు.. మేయర్ ఇచ్చిన చీరలను తమకు వద్దంటూ నిరసన తెలిపారు. తాము ఎండలో పని చేస్తామని ఈ చీరలు కట్టుకుంటే తాము ఇబ్బంది పడుతామని అసలే ఎండలు వీపరీతంగా వున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు క్వాలిటీ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్పిపల్ పారిశుద్ద కార్మికులు ప్రశ్నిం చడంతో అక్కడి నుండి మేయ ర్ నీతూ కిరణ్ వెనుదిరిగారు. మేయర్ నీతూ కిరణ్ తీరుపట్ల కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement