Wednesday, January 22, 2025

Mulugu – మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం

ములుగు, ఆంధ్ర‌ప్ర‌భ : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న కొండాయి గ్రామంలో.. ప్ర‌స్తుతం అబ్బాయిగూడెంలో… మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గ‌లు ధ్వంసం చేశారు. వరుస ఘటనలతో అధికార పార్టీ లో అయోమయం నెలకొంది.

ప‌ది నెల‌లు గ‌డుస్తున్నా…
10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదని, ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం శంకుస్థాప‌న చేసి శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ శిలాప‌ల‌కాన్ని దుండ‌గులు ధ్వంసం చేశారు. మంగపేట మండలం అబ్బయిగుడెం గ్రామంలో వేసిన రహదారి నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం ధ్వంసం కావడం మరొక్క సారి చర్చగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement