మంత్రి హరీశ్ రావు..ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్నిహతుడైన జగదీష్ మృతి ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారన్నారు. ఆయన మృతి పట్ల మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి పువ్వాడ.. ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. జగదీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జగదీష్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని మంత్రి పువ్వాడ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీకి,ములుగు జిల్లాకు వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి కేసీఆర్తో, పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా సేవలు అందించారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి.. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీష్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అన్నారు. వారి మృతి తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారన్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ నన్ను కలిసినప్పుడల్లా ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి BRS పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
ఎమ్మెల్యే సీతక్క.. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మరణం జిల్లాకు తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ హాజర హాస్పటల్ లో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గారు గుండె పోటు తో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చీఫ్ విప్ వినయ్ భాస్కర్..ములుగు జడ్పీ చైర్మన్ .. నియోజకవర్గ ఇన్చార్జ్ ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సహచరులుగా, సన్నిహితుడిగా ఉన్న ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మృతి విషయం తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. జగదీష్ అకాల మృతి పట్ల సంతాపం తెలిపారు.