అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు స్వయంగా వైద్యసేవలు అందించిన ములుగు జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్యకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు. కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యసేవలు అందించడాన్ని స్వాగతిస్తూ డీఎంహెచ్‌వో సేవలను కొనియాడారు.
https://www.prabhanews.com/importantnews/mukugu-dmho-team-medical-treatment-to-gurijans/ Wajedu – వాగులు, గుట్టలు దాటి అడవి బిడ్డలకు వైద్యం – డి ఎం హెచ్ ఓ అప్పయ్యకు ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నిర్మూలనకు వైద్యులు, వైద్యాధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని రాజనర్సింహ తెలిపారు. విశేషంగా సేవలందిస్తున్న వైద్యులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ములుగు డీఎంహెచ్‌వోను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజనులకు వైద్యసేవలు అందించాలన్నారు.