Thursday, September 12, 2024

Mulugu – పిచ్చికుక్క స్వైర విహారం

నూగురు వెంకటాపురం (ప్రభ న్యూస్ )ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి, ఏడుగురిని కరిచింది. వీధుల్లో వెళ్లే వారిపై ఎగబడి కరిచింది. మనుషులతో పాటు మేకలను కూడా కొరికింది. ఇంట్లో ఉన్న మహిళలను, తల్లులను సైతం పిచ్చికుక్క కాట్లకు గురయ్యారు.

పెద్ది లక్ష్మయ్య ఇంట్లోకి జొరబడి కరుస్తుండగా కుక్కని గట్టిగా ఒడిచి పట్టుకోవడంతో చేతులు ను ఇష్టం వచ్చినట్టు కొరికి వేసింది. దీంతో అతనికి నరాలు కట్ అయ్యాయి. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది లక్ష్మయ్య, ఇండ్ల వెంకటేశులు ను అంబు లెన్స్ ధ్వార ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర రక్త స్రావం జరిగిన పెద్ది లక్ష్మయ్య ను ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించనున్నట్లు సమాచారం.

- Advertisement -

మెరుగైన వైద్యం- – డాక్టర్ అప్పయ్య
వెంకటాపురం మండలం నూగూరు గ్రామంలో కుక్క కాట్ల కు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఎటునాగారంలో తరలించిన పెద్ది లక్ష్మయ్య ఇండ్ల వెంకటేష్ లకు మెరుగైన ప్రత్యేకమైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ములుగు లేక, వరంగల్ ఎంజీఎం కు తరలిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement